త్వరలో మిడ్‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లో హీరో ఎలక్ట్రిక్ బైక్‌‌‌‌

న్యూఢిల్లీ : మిడ్‌‌‌‌సైజ్ ఎలక్ట్రిక్ బైక్‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేయడానికి  హీరో మోటోకార్ప్‌‌‌‌, ఈ కంపెనీ యూఎస్ పార్టనర్‌‌‌‌‌‌‌‌ జీరో మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్స్  ప్లాన్ చేస్తున్నాయి. బైక్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ చివరి స్టేజ్‌‌‌‌లో ఉందని హీరోమోటోకార్ప్‌‌‌‌ సీఈఓ నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. 2022 లో జీరో మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్స్‌‌‌‌లో 60 మిలియన్ డాలర్లను హీరో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఇంకో ఆరు నెలల్లో అన్ని సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌‌‌‌ విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌‌‌‌‌‌ను రూ.1–1.5 లక్షల రేంజ్‌‌‌‌లో అమ్ముతోంది. ఇందులో రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలు కూడా కలిసి ఉన్నాయి.