భారీ వర్షాలు.. సింగరేణి సంస్థకు రూ. 38 కోట్ల నష్టం

మంచిర్యాల జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది.  శ్రీరాంపూర్, ఇందారం,అర్కేపీ,కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ గనులలోకి వర్షపు నీరు చేరడంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు ఉత్పత్తి చేసే 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఈ వర్షాలతో సింగరేణి సంస్థకు దాదాపు 38 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.