మెదక్లో కుండపోత వర్షం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది.  మెదక్ జిల్లాలో గంటన్నర సేపటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది మెదక్ పట్టణంలో  12.6 సెం.మీ వర్షపాతం  నమోదయ్యింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.  రామాయంపేటలో కాలనీలన్నీ నీట మునిగాయి. 

 ప్రధాన రహదారి జలమయం అయ్యింది. రాందాస్ చౌరస్తా, సాయినగర్‌, ఆటో నగర్‌ కాలనీల్లోకి వరదీ నీరు చేరింది.  వరదలకు బైకులు కొట్టుకుపోయాయి.వాహనాలు నిలిచిపోవడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.