బెల్లంపల్లిలో భారీ వర్షం..ఇండ్లలోకి చేరిన నీరు

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లిలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. కాల్ టెక్స్–రైల్వే స్టేషన్​ రోడ్డులోని పలు కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. రైల్వే ట్రాక్ పక్కన కల్వర్టు నిర్మించకపోవడంతో భారీ వర్షాలు 

కురిసిన ప్రతిసారి ఇండ్లలోకి నీరు చేరు చేరి సామగ్రి, వస్తువులు తడిసిపోతు న్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ట్రాక్​ పక్కన కల్వర్టు నిర్మించాలని బాధితులు కోరుతున్నారు.