కడెం - వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటి మట్టం 686.675 అడుగులు (4.677 టీఎంసీలు) ఉంది.
2646 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి నాయక్ తెలిపారు.