నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 692.350 అడుగులకు చేరింది. 12, 335 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, గోదావరిలోకి 13,856 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఉగ్రరూపం దాల్చిన కుంటాల
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సందర్శకులు దూరం నుంచే జలపాతం అందాలను గురువారం వీక్షించారు.