ఆరోగ్య బీమా పైసలు ఇస్తలేరు.. రూ.15 వేల కోట్ల క్లెయిమ్స్ ​రిజెక్ట్

న్యూఢిల్లీ: హెల్త్​ ఇన్సూరర్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్స్‎ను తిరస్కరించారు. మొత్తం క్లెయిమ్స్‎లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‎డీఐ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం రూ.1.17 లక్షల కోట్ల విలువైన హెల్త్​ఇన్సూరెన్స్ క్లెయిమ్స్​రాగా, కంపెనీలు మాత్రం రూ.83,493.17 కోట్లు (71.29 శాతం) మాత్రమే చెల్లించాయి. 

2023-–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.26 కోట్ల క్లెయిమ్స్​రాగా, 2.69 కోట్ల క్లెయిమ్స్‎ను మాత్రమే కంపెనీలు సెటిల్ చేశాయి. ఒక్కో క్లెయిమ్‎కు సగటున రూ.31,086 చెల్లించాయి. 72 శాతం క్లెయిమ్స్‎ను టీపీఏల ద్వారా, మిగతా వాటిని సొంతగా కంపెనీలు పరిష్కరించాయి. 66.16 శాతం క్లెయిమ్స్‎ను క్యాష్​లెస్​ పద్ధతిలో, మిగతా వాటిని రీయింబర్స్​మెంట్​పద్ధతిలో సెటిల్​చేశాయి. 2023-–24 లో కంపెనీలు రూ.1.07 లక్షల కోట్లను ప్రీమియంగా వసూలు చేశాయి.