సిద్దిపేట రూరల్, వెలుగు: అనారోగ్యంతో చికిత్స పొందుతూ సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ సలిమొద్దీన్ మంగళవార్ సాయంత్రం మృతి చెందారు. 1995 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా, గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం తో సికింద్రాబాద్ యశోద లో చికిత్స పొందుతూ చనిపోయారు.
విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి అనురాధ హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. డిపార్ట్మెంట్ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ విజయ్ భాస్కర్, ఆర్ఎస్ఐ వెంకటరమణ, పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు మృతినికి నివాళలర్పించారు. అంత్యక్రియల కోసం ప్రభుత్వం తరఫున రూ. 20 వేల వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.