కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఫ్రెండ్స్ పెళ్లికి వచ్చి.. యాక్సిడెంట్ లో యువకుడి మృతి

సైదాపూర్, వెలుగు: ఫ్రెండ్ పెళ్లిలో అప్పటి వరకు సంతోషంగా గడిపిన యువకుడు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  కరీంనగర్​ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లికి చెందిన పొన్నం లక్ష్మి, కనుకయ్య దంపతులకు ముగ్గురు కుమారులు.  చిన్న కుమారుడు పొన్నం మహేందర్ (26) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు.  సైదాపూర్​ మండలం జాగిరిపల్లికి తన ఫ్రెండ్ గుండేటి వంశీ పెళ్లికి ఈ నెల 26న రాత్రి  హాజరయ్యాడు.

అదే రోజు రాత్రి తిరిగి హన్మకొండలో ఉన్న తన అన్న ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో మండలంలోని రాంచంద్రాపూర్​సమీపంలో బైక్​ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలు కాగా.. స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడి సోదరుడు కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు సైదాపూర్​ ఎస్సై తిరుపతి తెలిపారు. 

రెండు కాళ్లపై ఎక్కిన లారీ ట్యాంకర్ 

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామ శివారులో శుక్రవారం బైక్ పై వెళుతున్న ఏలూరి మణికంఠ రెడ్డి అనే యువకుడుని ఓ పెట్రోల్ ట్యాంకర్  ఢీకొనడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మణికంఠ రెడ్డిని  పోలీసులు వాహనంలో కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

వ్యక్తి మిస్సింగ్ 

మెట్ పల్లి, వెలుగు:  జగ్గసాగర్ కు చెందిన పూసల నరేందర్ (45) గురువారం తన మేనల్లుడి పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. బోడుప్పల్లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి అటెండ్ అయి మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నరేందర్ కు మతిమరుపు, జ్ఞాపక శక్తి తక్కువ ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య  

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.  గ్రామానికి చెందిన పర్శ సుందరయ్య (65) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య కాంతమ్మ, కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు గత మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు.  మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు.

గేదెల మృతిపై బాధితులపై చర్యలు తీసుకోవాలి 

మంథని, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని మంథని మండలం గంగాపురిలో అయిదు గేదెలు మృతి చెందాయి.  వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిపై గంగాపురి వద్ద  గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో రోడ్డు పక్కన ఉన్న గేదెలు చనిపోయాయి. గోవుల మృతి పై విశ్వ హిందూ పరిషత్ శాఖ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కు సంబంధించిన వివరాలు సీసీ కెమెరాల్లో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

చికిత్స పొందుతూ యువకుడి మృతి

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన  సంద సురేశ్  (28) ఈ నెల 24 న కారులో జగ్గాసాగర్ నుంచి మెట్ పల్లికి వెళ్తుండగా వెల్లుల్ల గ్రామం దాటినా ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి కారును ఢీ కొట్టాడు.   దీంతో సురేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి.  చికిత్స కోసం మెట్ పల్లి హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  సురేశ్ శుక్రవారం సాయంత్రం చనిపోయాడు.