ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేయాలి


నేరడిగొండ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేయాలని ఎంపీడీవో రాజ్ వీర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని కుంటాల (కె) గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఆఫీసర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


జవాన్లుగా ఎంపికైనవారికి సన్మానం

నేరడిగొండ, వెలుగు: యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ , క్రమశిక్షణతో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన సాబ్లే పవన్ కుమార్, ఈస్పూర్ గ్రామానికి చెందిన పేలియ ఆనంద్ కుమార్ సీఆర్పీఎఫ్ జవాన్లుగా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని బలరాం జాదవ్ సన్మానించి, అభినందిం చారు. నైపుణ్యాన్ని పెంపొందించుకొని , యువత కష్టపడే తత్వంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు .


నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి


నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజర్షి షాను బుధవారం బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ తో చర్చించినట్లు గజేందర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి తదితరులున్నారు.


విద్యుత్ సరఫరాలో అంతరాయం

పెంబి, వెలుగు: ఖానాపూర్ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని సత్తనపల్లి, బీర్ నంది, పాత ఎల్లాపూర్, లింగాపూర్, పెంబి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఖానాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఎం.రాంసింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ పెంబి ఫిడర్ పైన చెట్ల కొమ్మలను తొలగించడం తోపాటు విద్యుత్ లైన్ల రిపేర్ల కారణంగా కోత విధిస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు.


చిరుత సంచారం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండలం కాల్వ గ్రామ సమీప అడవుల్లో చిరు తపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను కొంత మంది సెల్ ఫోన్ లో రికార్డు చేసి వాట్సప్ లో షేర్​చేయగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు  భయందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే అటవీ ప్రాంతంలో పెద్ద పులి కూడా సంచరించింది.