బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ లో  బీరప్ప ఉత్సవాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల అందరం సల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రతినిధులు హరీశ్ రావును సత్కరించారు. అనంతరం మాచాపూర్ లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. నంగునూర్ మండలం నర్మేట గ్రామ ఎంపీటీసీ బాబు తండ్రి ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని హరీశ్ రావు  పరామర్శించారు.