కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు

10 ఏళ్ళు దేశాన్ని పాలించిన బీజేపీ తెలంగాణకు  ఏం ఇచ్చిందో చేప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పట్లేదని విమర్శించారు.  రాహుల్ చెప్పినట్లుగా ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలన్నారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న కాంగ్రెస్ బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు హరీశ్ .  కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు.కాంగ్రెస్,బీజేపి ఫేక్ వీడియోల జిమ్మిక్కులను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు హరీశ్.