ఉద్దెర డబ్బులు ఇవ్వాలని వేధింపులు.. యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

నిర్మల్, వెలుగు: ఉద్దెర పెట్టిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని నాయుడివాడకు చెందిన వంశీకృష్ణ (30) ఓ నర్సింగ్‌‌‌‌‌‌‌‌హోంలో మెడికల్‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నాడు. తన షాప్‌‌‌‌‌‌‌‌ కోసం మెడికల్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ వద్ద ఉద్దెరకు మందులు కొనుగోలు  చేశాడు. తర్వాత కొంత మొత్తం నగదు చెల్లించగా మరికొంత పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉంది. మిగిలిన డబ్బులు సైతం  ఇవ్వాలని మెడికల్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌, శివ, రోహిత్‌‌‌‌‌‌‌‌, రంజిత్‌‌‌‌‌‌‌‌ కలిసి వంశీకృష్ణను వేధించారు. 

దీంతో మనస్తాపానికి గురైన వంశీకృష్ణ గురువారం రాత్రి నిద్ర మాత్రలు మింగాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. మృతుడి తల్లి జయ ఫిర్యాదుతో శ్రీధర్, శివ, రోహిత్, రంజిత్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.