వైభవంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండలంలోని రాజుల తండాలో కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా సాగింది. వేద పండితుడు శ్రవణ్ కుమార్ జ్యోషి ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం, రుద్ర హోమం, ప్రత్యేక పూజలు చేసి బుధవారం హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు.

ఈ సందర్భంగా సంత్ పూజ్య లింబాజీ మహారాజ్ తో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జై శ్రీరామ్..జై హనుమాన్ నినాదాలతో  హోరెత్తించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ తదితరులు పాల్గొన్నారు.