GST Collections: డిసెంబర్ లో GST కలెక్షన్లు..1.77 లక్షలకోట్లు..7.3 శాతం పెరిగాయ్

2024డిసెంబర్ లో జీఎస్టీ 1.76 లక్షలకోట్లు వసూలు అయింది. ఇది గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీతో పోలిస్తే 7.3 శాతం పెరిగింది. బుధవారం (జనవరి 1, 2025) విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ లో మొత్తం గ్రాస్ జీఎస్టీ రెవెన్యూ 1.77 లక్షలకోట్లు వసూలు అయింది. గతేడాది ఇదే సమయంలో 1.65 లక్షల కోట్లు వసూలు అయింది.

డిసెంబర్ లో రూ.22,490 కోట్లు రీఫండ్ చేయబడ్డాయి. గత ఏడాది కాలంతో పోలిస్తే రీఫండ్స్ 31 శాతం పెరిగాయి. రీఫండ్ సర్దుబాటు తర్వాత నికర GST వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి.

ALSO READ | 2025లో కోటీశ్వరులు కావటం ఎలా: ఈ 15 మ్యూచువల్ ఫండ్స్ లో ట్రై చేయండి..!

డిసెంబర్ లో దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 1.32 లక్షల కోట్లు వచ్చాయి. అంటే గతంతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. దిగుమతులపై జీఎస్టీ రెవెన్యూ 4 శాతం పెరిగింది. ఇంపోర్ట్ పన్నులు 44వేల 268 కోట్లు వసూలు అయ్యాయి. గత నవంబర్ లో జీఎస్టీ రూ.1.82లక్షల కోట్లు వసూలు కాగా.. అత్యధికంగా 2024 ఏప్రిల్ లో రూ. 2.10లక్షల కోట్లు వసూలు అయ్యాయి.