ఆర్థిక వ్యవస్థ మందగించడానికి అనేక కారణాలు: ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌‌

  • కేవలం వడ్డీ రేట్లను తగ్గించకపోవడంతోనే గ్రోత్ నెమ్మదించలేదు
  • వృద్ధి – ఇన్‌‌ఫ్లేషన్‌‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి
  • యూఎల్‌‌ఐ, సీబీడీసీపై కొత్త గవర్నర్‌‌‌‌ ఫోకస్ పెట్టాలి

న్యూఢిల్లీ: ఎకానమీ గ్రోత్‌‌, ఇన్‌‌ఫ్లేషన్‌‌ మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం ఆర్‌‌‌‌బీఐ ముందున్న అతిపెద్ద సవాలని  రిజర్వ్‌‌ బ్యాంక్ (ఆర్‌‌‌‌బీఐ) మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దాస్ పదవీకాలం  మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడారు.  కేవలం రెపో రేటు ఎకానమీపై ప్రభావం చూపదని,  గ్రోత్ నెమ్మదించడానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. శక్తికాంత దాస్ గత ఆరేళ్లుగా ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే కరోనా ,  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం వంటి సంక్షోభాలు నెలకొన్నాయి.

ఈ టైమ్‌‌లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలకంగా పనిచేశారు. ‘ప్రస్తుత పరిస్థితులను, ఫ్యూచర్ ఔట్‌‌లుక్‌‌ను పరిగణనలోకి తీసుకొని అనువైన మానిటరీ పాలసీని తీసుకొచ్చాం’ అని దాస్ ప్రెస్‌‌మీట్‌‌లో పేర్కొన్నారు.  పరిస్థితులకు తగ్గట్టు ఆర్‌‌‌‌బీఐ, ఎంపీసీ మెరుగైన నిర్ణయాలు తీసుకుందని అభిప్రాయపడ్డారు. కాగా, యూనియన్ ఫైనాన్స్‌‌ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌, కామర్స్ మినిస్టర్‌‌‌‌ పీయూష్ గోయెల్‌‌   రెపో రేట్లను తగ్గించాలని ఆర్‌‌‌‌బీఐపై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో జీడీపీ వృద్ధి రేటు  రెండేళ్ల కనిష్టమైన 5.4 శాతానికి పడిపోవడంతో చాలా మంది రేట్లకు కోత పెట్టాలని పబ్లిక్‌‌లో  ప్రకటనలు చేయడం చూశాం. ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉందని,  గ్లోబల్‌‌ సంక్షోభాల ప్రభావాన్ని తట్టుకోగలదని   దాస్ ధీమా వ్యక్తం చేశారు.  ఆర్‌‌‌‌బీఐ కొత్త గవర్నర్‌‌‌‌ సంజయ్ మల్హోత్రాకు  చాలా అనుభవం ఉందని అన్నారు.  ఎంపీసీలో మార్పులు చేయడంపై ఆయన ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. ఆర్‌‌‌‌బీఐ లాంటి పెద్ద సంస్థల్లో ఎప్పుడూ మార్పులు జరుగుతుంటాయని, పూర్తికాని  టాస్క్‌‌లు ఉంటూనే ఉంటాయని తెలిపారు.

 ఇబ్బందుల్లోని సంస్థలకు డబ్బులివ్వొద్దు..

లోన్లను ఈజీగా తీసుకోవడానికి వీలుకల్పించే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూఎల్‌‌ఐ)  త్వరలో  లాంచ్ అవుతుందని, అలానే ఫ్యూచర్ కరెన్సీ అయిన  సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ని విస్తరించాలని  శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను బతికించడానికి ట్యాక్స్ పేయర్ల డబ్బులను వాడొద్దని ఆయన సలహా ఇచ్చారు. యెస్ బ్యాంక్ ఇష్యూని గుర్తు చేసుకుంటూ ఆయనీ కామెంట్స్ చేశారు.

ఎస్‌‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం యెస్‌‌ బ్యాంక్‌‌ను కొనుగోలు చేసింది. యెస్ బ్యాంక్ సంక్షోభంతో ఇతర సంస్థలపై ఆర్‌‌‌‌బీఐ  సూపర్‌‌‌‌విజన్ పెంచింది. ఫిన్‌‌టెక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ కఠినంగా లేదని, సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టడం చాలా అవసరమని దాస్ అన్నారు. తన హయాంలో ఫైనాన్షియల్ సంస్థలపై రిస్ట్రిక్షన్లు  పెరగడంపై ఆయన స్పందించారు. కొన్నిసార్లు ఏడాది పొడవునా చర్చలు జరిపాక రిస్ట్రిక్షన్లు పెట్టామని, రిస్ట్రిక్షన్లు విధించకూడదనే చర్చలు జరిపామని అన్నారు.

ఆర్‌‌‌‌బీఐలో అన్నీ అర్థం చేసుకుంటా: మల్హోత్రా

ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌గా‌‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని అంశాలను అర్ధం చేసుకుంటానని,  ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటానని ఆర్‌‌‌‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ప్రస్తుతం  ఇన్‌‌ఫ్లేషన్ ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో 14 నెలల గరిష్టమైన 6.21 శాతానికి పెరిగింది.  జీడీపీ గ్రోత్‌‌ కూడా నెమ్మదించింది.

ఇలాంటి టైమ్‌‌లో ఆయన ఆర్‌‌‌‌బీఐ బాస్‌‌గా నియమితులయ్యారు. ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కేవలం ఆర్‌‌‌‌బీఐ మాత్రమే తగ్గించలేదని, ప్రభుత్వ సాయం అవసరమన్నారు. మల్హోత్రా ఆర్‌‌‌‌బీఐ 26 వ గవర్నర్‌‌‌‌గా బుధవారం బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ సెక్రెటరీగా పనిచేస్తున్నారు.