గ్రాన్యూల్స్ ఫార్మా డ్రగ్​కు ఆమోదం

న్యూఢిల్లీ: ఏకాగ్రత లోపం, హైపర్​ యాక్టివిటీ  చికిత్సకు ఉపయోగించే జెనరిక్ ఔషధానికి యూఎస్​ హెల్త్ రెగ్యులేటర్ నుంచి తమ అనుబంధ సంస్థ ఆమోదం పొందిందని ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా మంగళవారం తెలిపింది.  గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన లిస్డెగ్యామ్​ఫెటమిన్​డైమ్సిలేట్​ టాబ్లెట్ల కోసం దాని సంక్షిప్త కొత్త డ్రగ్ అప్లికేషన్ (ఏఎన్​డీఏ)కు యూఎస్​ ఫుడ్ అండ్​ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్​ఎఫ్​డీఏ) నుంచి ఆమోదం వచ్చింది. 

 ఈ ట్యాబ్లెట్లు10 ఎంజీ, 20 ఎంజీ, 30 ఎంజీ, 40 ఎంజీ, 50 ఎంజీ  60 ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉంటాయి.  తకేడా ఫార్మా వైవాన్సే చూవబుల్​ ట్యాబ్లెట్లకు లిస్డెగ్యామ్​ఫెటమిన్​డైమ్సిలేట్​ టాబ్లెట్లు సమానమని గ్రాన్యూల్స్​ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.