వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: మండలంలోని కాసాల ( దౌల్తాబాద్ )12వ వార్డులో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కలశ సమర్జనం కార్యక్రమాలు నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ వెంకటమ్మ, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బక్క రవి, ప్రభాకర్, సందీప్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సురేశ్ గౌడ్, చెప్యాల నరసింహారెడ్డి, కొండ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.