కూరెల్ల గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

కోహెడ, వెలుగు; మండలంలోని కూరెల్ల  గ్రామంలో హను​మాన్​ శోభాయాత్ర గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్​ ఫోటో పల్లకిలో ప్రతిష్టించి కాషాయ జెండాలతో గ్రామంలోఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.దీక్షాపరులు హను​మాన్​ పాటలు పాడుతూ,సంకీర్తనలు చేస్తూ ముందుకు సాగారు.జై హన్​మాన్​..జై శ్రీరాం స్వామివారి నామస్మరణలతో గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్​ దీక్ష భక్తులు పాల్గొన్నారు.