జీతాల కోసం పంచాయతీ కార్మికుల భిక్షాటన

కాగజ్ నగర్, వెలుగు: ఎనిమిది నెలలుగా వేతనాలు అందక అవస్థ పడుతున్నామని, దుర్భరమైన జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామపంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు గురువారం భిక్షాటన చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో భిక్షాటన నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన వేతనాలను తక్షణమే తమ ఖాతాలో జమ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీ డబ్ల్యూ వర్కర్స్ మండల అధ్యక్షులు గోరంట్ల వసంత్, సంఘం సభ్యులు భాస్కర్, శైలేశ్, సలీం తదితరులు పాల్గొన్నారు.