ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్..  హరీష్ రావు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకో..!

రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ లో రైతులకి రుణమాఫీ సంబరాల్లో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదికవద్దకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్  రావుకు సవాల్ విసిరారు.  మీరు మానసికంగా సిద్దంగా ఉండాలంటూ  ... స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా లెటర్ తయారు సుకోవాలన్నారు.  రుణమాఫీ గురించి బీఆరఎస్ నేతలు ఎన్నో అవాకులు, చవాకులు పేల్చారని..  కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి.. రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధును గుట్టలకు, చెట్లకు, వాగులకు, వంకలకు..  ఇంకా అనర్హులకు కూడా రైతుబంధును కట్టబెట్టిందన్నారు. నేడు రైతుబంధును రైతు భరోసాగా మార్చి నిజమైన రైతులకు రైతు భరోసా అందజేస్తున్నామన్నారు. ఓవైపు బీఆర్ఎస్ మరో బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతూ...  నిబద్ధతతో రైతులకు రుణమాఫీ చేస్తే అక్కడక్కడ హరీష్ రావు,  కేటీఆర్ , కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై లేని పని విమర్శలు చేస్తున్నారన్నారు.