ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్​ డ్రైవ్ : అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

నిజాంపేట, వెలుగు: జిల్లాలో ధరణి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నడుస్తోందని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన నిజాంపేట తహసీల్దార్ ఆఫీస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్య క్రమంలో ధరణి పెండింగ్​ అప్లికేషన్లను క్లియర్​చేస్తున్నామని చెప్పారు.

మండలంలో ధరణి అప్లికేషన్లు 64 మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం నిజాంపేట తహసీల్దార్​ఆఫీస్ కొనసాగుతున్న అద్దె ఇల్లు శిథిలావస్థకు చేరిందని వర్షాకాలంలో ఆఫీస్ ను ఈ ఇంట్లో నడపడం అంతా సేఫ్టీ కాదన్నారు. ఆఫీస్ కోసం మరో అద్దె స్థలాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సురేశ్​కుమార్, ఆర్ఐ గంగాధర్ ఉన్నారు.