- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు : కార్పొరేట్స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్స్కూల్స్లో విద్యా బోధన చేస్తున్నారని, పదో తరగతిలో వచ్చిన మార్కులే అందుకు నిదర్శమని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. గురువారం పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో గవర్నమెంట్స్కూల్స్లో చదివి పదిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ను సన్మానించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. గవర్నమెంట్స్కూల్స్లో చదివిన 400 మంది స్టూడెంట్స్ఉత్తమ ఫలితాలు సాధించడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల బోధన వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్టూడెంట్స్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రిన్సిపల్, టీచర్లు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అమ్మ ఆదర్శ స్కూల్ పనులు పూర్తి చేయాలి
కొల్చారం: అమ్మ ఆదర్శ స్కూల్కింద ఆయా స్కూల్స్లో చేపట్టిన రిపేర్పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కొల్చారం మండలం పోతం శెట్టిపల్లి చౌరస్తా, సంగాయిపేట్ గవర్నమెంట్ప్రాథమిక స్కూల్స్లో చేపట్టిన రిపేర్పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్కూల్స్లో నీటి సరఫరా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదొడ్ల రిపేర్, నీటి సదుపాయం, స్కూల్ఆవరణలో రిపేర్పనుల గురించి
డీఈవో రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంపికైన 562 అమ్మ ఆదర్శ స్కూల్స్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60 శాతం పనులు పూర్తయ్యాయని డీఈవో కలెక్టర్కు వివరించగా మిగతా పనులు వారంలో పూర్తి చేసి పెయింటింగ్ కు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో నీలకంఠం, ఏఈ మహేశ్ ఉన్నారు.