ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీగా రామ్మోహన్ ​రావు

న్యూఢిల్లీ :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్​గా  తెలుగు వ్యక్తి రామ్మోహన్ రావు అమర నియమితులు అయ్యారు.   ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆయన, మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు, ఏది ముందుగా అయితే అది అమలులోకి వస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చిందని ఎస్​బీఐ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.  

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించడం వల్ల ఏర్పడిన ఖాళీని ఆయనతో భర్తీ అయింది. శెట్టి కూడా తెలుగువారే కావడం గమనార్హం.  ఎస్​బీఐ బోర్డుకు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల సహాయంతో ఒక చైర్మన్ నాయకత్వం వహిస్తారు. రామ్మోహన్ రావు ఎంపికతో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి నాలుగో ఎండీ వచ్చారు. ఈ పదవికి  రావు సహా తొమ్మిది మందిని ఎఫ్​ఎస్​ఐబీ ఇంటర్వ్యూ చేసింది. పనితీరు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనను ఎంపిక చేసింది.