స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు, ఆటోలను కొనుగోలు చేసింది. కానీ కొన్ని గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణ వాహనాలను ఉపయోగించడం లేదు.
దీంతో అవి తుక్కుగా మారుతున్నాయి. కుభీర్‌లో చెత్త తీసుకెళ్లే ఆటోకు చిన్న సమస్య రావడంతో దాన్ని రిపేర్ చేయించకుండా పక్కకు పడేశారు. ఏడాది కాలంగా దాన్ని వినియోగించకుండా టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉంచారు. ఫలితంగా గ్రామంలో చెత్త సేకరణకు ఇబ్బంది ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.
వెలుగు, కుభీర్