- జిల్లా గోడౌన్ల నుంచి మండలాలకు సప్లై షురూ
- స్కూల్స్ రీ ఓపెన్ రోజే స్టూడెంట్స్‌కు అందజేత
మెదక్, సంగారెడ్డి, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకునే స్టూడెంట్స్‌కు టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్‌ను ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేస్తోంది. 2024,-25 అకడమిక్ఇయర్త్వరలో ప్రారంభం కానుండగా హైదరాబాద్‌లోని స్టేట్ గోడౌన్‌నుంచి జిల్లా గోడౌన్లకు అవసరమైన టెక్ట్స్, నోట్ బుక్స్ చేరుకుంటున్నాయి. ఈ పాటికే దాదాపు 70 శాతం బుక్స్ రాగా అక్కడి నుంచి మండల వనరుల కేంద్రాలకు పంపిస్తున్నారు. స్కూల్స్రీ ఓపెన్రోజునే స్టూడెంట్స్‌కు వాటిని అందించేలా విద్యాశాఖాధికారులు ప్లాన్ చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో అన్ని మేనేజ్మెంట్లవి కలిపి మొత్తం 938 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ప్రైమరీ స్కూల్స్624, అప్పర్ ప్రైమరీ స్కూల్స్128, హైస్కూల్స్146, కేజీబీవీలు15, మాడల్ స్కూల్స్7, రెసిడెన్షియల్‌స్కూల్స్18 ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 97,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 2024-, 25 అకడమిక్ ఇయర్ కు మొత్తం10,84,979 లక్షల టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ అవసరం.
జిల్లా గోడౌన్లో 26,675 బుక్స్ నిల్వ ఉండగా ఇంకా 10,58,304 బుక్స్ రావాల్సి ఉంది. టెక్ట్స్బుక్స్పార్ట్ 1, ఇంగ్లీష్ మీడియం, లాంగ్వేజెస్ కలిసి మొత్తం 4,80,566 అవసరం. జిల్లా గోడౌన్లో 20,716 బుక్స్నిల్వ ఉండగా, స్టేట్ గోడౌన్ నుంచి 2,96,090 బుక్స్ (64.39 శాతం) వచ్చాయి. ఇవి పోను ఇంకా 1,63,760 బుక్స్ రావాల్సి ఉంది. టెక్ట్స్ బుక్స్పార్ట్- 2 వి 1,80789 అవసరం ఉండగా, గోడౌన్లో 5959 నిల్వ ఉన్నాయి. ఇవి పోను ఇంకా 1,74,830 బుక్స్ రావాల్సి ఉంది. సింగిల్రూట్నోట్బుక్స్79,200 అవసరం కాగా మొత్తం వంద శాతం వచ్చాయి. ప్లేన్నోట్బుక్స్3,44,424 అవసరం ఉండగా ఇప్పటి వరకు 2,72,800 (79.20 శాతం) వచ్చాయి. ఇంకా 71,624 రావాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాకు ఇప్పటివరకు 72.5 శాతం బుక్స్వచ్చాయి. జిల్లాలో మొత్తం 1,247 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో హైస్కూల్స్ 203, యుపీఎస్ 192, పీఎస్ 852 స్కూల్స్ ఉండగా, మొత్తం స్టూడెంట్స్ 1.30 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ కలిపి మొత్తం7,59,903 టెక్స్ట్ బుక్కులు అవసరం ఉండగా ప్రస్తుతానికి 5,51,240 బుక్స్ వచ్చాయి. మిగతా 2,08,663 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉన్నాయి.
సబ్జెక్టుల వారీగా టెక్స్ట్ బుక్కులు రెండు విభాగాలుగా ఉండడంతో ప్రస్తుతం పార్ట్-1 పుస్తకాలు అందినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అయితే పార్ట్-- 2లో వచ్చే బుక్స్ అక్టోబర్ తర్వాత రానున్నాయి. జిల్లాకు మొత్తం నోట్‌బుక్స్6,14,073 అవసరం. ఇందులో 4,79,180 వచ్చాయి. ఇవిపోను 1,34,893 రావాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్స్ కు జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా పాఠ్య పుస్తకాలు దించనున్నారు.
మండలాలకు సరఫరా చేస్తున్నాం
హైదరాబాద్‌లోని స్టేట్గోడౌన్నుంచి మెదక్ లోని జిల్లా గోడౌన్‌కు టెక్ట్స్‌బుక్స్, నోట్బుక్స్వస్తున్నాయి. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా వచ్చాయి. గురువారం నుంచి మండలాలకు బుక్స్ సరఫరా ప్రారంభించాం. స్కూల్స్రీ ఓపెన్అయ్యేలోగా అన్ని స్కూల్స్‌కు అవసరమైన టెక్ట్స్, నోట్బుక్స్వస్తాయి.
- శ్రీధర్, టెక్ట్స్బుక్స్సేల్స్
ఆఫీస్ మేనేజర్, మెదక్