కుభీర్లోని గవర్నమెంట్ ప్రైమరీ హాస్పిటల్ చుట్టూ నీరు నిల్వ ఉండి కంపుకొడుతోంది. హాస్పిటల్ పక్కనున్న మురికి కాల్వపై కొందరు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకుని షాపులు నడిపిస్తున్నారు. దీంతో వర్షపు నీరు మురికి కాల్వలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో హాస్పిటల్ సమీపంలోకి వెళ్తోంది. ఫలితంగా పీహెచ్సీ చుట్టూ నీరు నిలిచి లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దుర్గంధం వెదజల్లుతుండడంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
--వెలుగు, కుభీర్