గుండాలలో ప్రభుత్వ భూమి స్వాధీనం

చేవెళ్ల,  వెలుగు : చేవెళ్ల మండలం గుండాలలోని సర్వే నంబర్​153లో101 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అందులోని కొంత భాగంలో గతంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మిగిలిన భూమిని శ్రీనివాస్ కుమార్, రాజా తాడిచెర్ల అనే ఇద్దరు ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కృష్ణయ్య ఆదేశాలతో రెవెన్యూ అధికారులు మంగళవారం సదరు కంచెను తొలగించారు. 15 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.