మంథని నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు

మంథని, వెలుగు: మంథని నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. రహదారుల అభివృద్ధి పథకం కింద  రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు నిధులు మంజూరు చేయించారు. మంథని మండలకేంద్రం నుంచి ఖానాపూర్ మీదుగా ఎల్ మడుగు వరకు రూ.7 కోట్లు, కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం రాజాపూర్ బ్రిడ్జి నుంచి మంగపేట వరకు రూ.3.05 కోట్లు, కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పెంచికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట వరకు రూ.4 కోట్లు, కాటారం మండలం దామరకుంట పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఆరెంద 

మానేరు రోడ్డుకు రూ.2 కోట్లు, కాటారం మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బూడిదపల్లి మీదుగా ధన్వాడ వరకు రూ.3.95 కోట్లు, గుండ్రాత్పల్లి నుంచి ఊట్లపల్లి పోచమ్మవరకు రూ.2 కోట్లు, ఒడిపిలిపించ నుంచి గూడూరు జడ్పీ రోడ్డు వరకు రూ.3 కోట్లు కేటాయించారు.