మార్కెట్ కమిటీ చైర్మన్ గా భీంరెడ్డి ప్రమాణం

నిర్మల్, వెలుగు: నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం బాధ్యతలు చేపట్టింది. మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చైర్మన్ మేడిపల్లి భీంరెడ్డితో పాటు వైస్ చైర్మన్​గా ఈటెల శ్రీనివాస్, ఎక్స్ అఫీషియో డైరెక్టర్​గా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డైరెక్టర్లుగా వంశీకృష్ణ, గజేందర్, గంగారాం, రాజారెడ్డి, వంజరి రూప, అజీం, మురళి, సాయన్న, వెంకటేశ్, సురేశ్, ఖలీల్, రాజగోపాల్​తో పాటు మార్కెటింగ్ ఏడీ, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితరులు డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిటీ చైర్మన్ భీంరెడ్డి అన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్ప నకు, మార్కెట్ కమిటీ ఆదాయ పెంపునకు డైరెక్టర్లు, రైతుల సహకారంతో కృషి చేస్తానన్నారు.