పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

  • రైళ్ల రాకపోకలకు అంతరాయం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రాఘవాపూర్– కన్నాల మధ్య మంగళవారం రాత్రి ఘజియాబాద్​నుంచి వస్తున్న గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది.  ట్రాక్​ కొంతమేర ధ్వంసం కావడంతో రెండు వైపులా రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.

  పట్టాలపై నుంచి గూడ్స్​ను తొలగించే పనుల్లో రైల్వే అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. అదేవిధంగా ట్రాక్​ రిపేర్లు చేపట్టారు. పూర్తి కావడానికి మరో 10 గంటలు పట్టొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. రైళ్లను దారి మళ్లించనున్నట్లు చెప్పారు.