గోల్డ్లోన్ తీసుకునేవారికి గుడ్న్యూస్..కిస్తీల ద్వారా బంగారు లోన్ల చెల్లింపు

న్యూఢిల్లీ: బ్యాంకులు, గోల్డ్​లోన్​ కంపెనీలు నెలవారీ కిస్తీల విధానంలో అప్పులను చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. బంగారు లోన్ల పంపిణీలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు ఆర్​బీఐ ఎత్తిచూపడంతో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇక నుంచి నెలవారీ విధానంలో వడ్డీ, అసలు చెల్లించాలని ఇవి వినియోగదారులను కోరవచ్చు.   

బ్యాంకులు కూడా బంగారంపై లోన్లను టర్మ్​లోన్​పద్ధతిలో ఇచ్చే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం  రుణగ్రహీత తన దగ్గర డబ్బు ఉన్నప్పుడే  అప్పును తిరిగి చెల్లించవచ్చు.  పాక్షికంగా తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉంది. 

బంగారు నగలు, ఆభరణాలపై రుణాల మంజూరులో అవకతవకలను ఆర్‌‌బీఐ ఇటీవల ఎత్తిచూపింది. గోల్డ్ లోన్‌‌ల సోర్సింగ్, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్ యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకతకు  సంబంధించి పలు లోపాలను ప్రస్తావించింది.