బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!

హైదరాబాద్: నవంబర్ నెల ఆరంభం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 10 గ్రాములపై 660 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,310 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 69,950 రూపాయలు పలికింది. 

నవంబర్ 9 నుంచి బంగారం ధరలను పరిశీలిస్తే.. నవంబర్ 18 నాటికి బంగారం ధర తగ్గిందనే చెప్పాలి. ఈ పది రోజుల్లో బంగారం ధరలు బాగానే తగ్గాయి.నవంబర్ 9న 22 క్యారెట్ల బంగారం ధర 72,750 రూపాయలు ఉండగా.. నవంబర్ 18న 69,950 రూపాయలకు పడిపోయింది. అలాగే.. 24 క్యారెట్ల బంగారం ధర నవంబర్ 9న 79,360 రూపాయలు ఉండగా, ఇవాళ అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,310 రూపాయలు పలికింది. 

ఈ పది రోజుల్లో 24 క్యారెట్ల బంగారం 3,050 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర నవంబర్ 9తో పోల్చితే నవంబర్ 18కి 2,800 తగ్గింది. ఇక.. వెండి ధరల విషయానికొస్తే సోమవారం నాడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆదివారంతో పోల్చితే సోమవారం కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నవంబర్ 9న కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 1,03,000 రూపాయలు ఉండగా, నవంబర్ 18న 99,000 వద్ద నిలిచింది.

Also Read : త్వరలో సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ధరలు పెరిగే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఇదిలా ఉండగా.. దీపావళి టైంలో అయితే బంగారం ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. బంగారం షాపుల్లో పండుగ వాతావరణం కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్లో ధనత్రయోదశి  అమ్మకాలు 30 శాతం కూడా జరగలేదని వ్యాపారులు తెలిపారు. నిరుటితో  పోలిస్తే  ఈసారి బంగారం ధర రూ.15 వేలు పెరగడంతో అమ్మకాలు తగ్గి ఉండవచ్చని పేర్కొంటున్నారు. కిందటేడాది 22 క్యారెట్ల బంగారం తులం రూ.65 వేలు ఉండగా.. హైదరాబాద్  మార్కెట్లో ధన త్రయోదశి నాటికి 22 క్యారెట్ల తులం బంగారం రూ.73,750 ఉంది. 24 క్యారెట్లు రూ.81,490గా ఉంది. సాధారణంగా ఏటా ధనత్రయోదశి.. బంగారం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈసారి పెరిగిన ధరలతో బిజినెస్  ఆశాజనకంగా లేదని వ్యాపారులు లబోదిబోమన్నారు.