బస్సు ఎక్కుతుండగా.. హ్యాండ్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 4 తులాల నగలు చోరీ

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న మహిళ హ్యాండ్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 4 తులాల బంగారం నగలు చోరీ అయ్యాయి. కథలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం తక్కళ్లపల్లికి చెందిన గుగ్గిళ్ల నిరోష(26) గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరింది. ఇటీవల చైన్ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా జరుగుతున్నాయని గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చుట్టి హ్యాండ్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాచుకుంది.

 మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు హ్యాండ్ బ్యాగులోని 4 తులాల బంగారు నగలు, రూ.1500 ఉన్న కర్చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూటను ఎత్తుకెళ్లారు. గమనించిన నిరోష వెంటనే బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చింది. అప్పటికే దొంగలు పరారయ్యారు.