బంగారం ధరలు వరుసగా రెండోరోజు కూడా పెరిగాయి. బుధవారం 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగ్గా..ఇవాళ( గురువారం ) మరో 500 రూపాయలుపెరిగింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550లు రూపాయలు పెరిగింది.
పెరిగిన ధరల ప్రకార.. గురువారం బంగారు ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,330 కు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 77వేల 800లకు చేరింది. గతవారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.89శాతం పెరిగింది. గత నెలలో 4.33 శాతం పెరిగింది.
Also Read :- అదానీ షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
మరో వైపు వెండి ధర కూడా పెరిగింది. గురువారం నాడు తులం వెండి ధర 500 రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర మార్కెట్లో రూ.95వేల 200లుగా ఉంది.