Gold Rate: ఇలా తగ్గుతుందేంటి.? మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

 బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఏం కొంటాములే అనుకున్న వాళ్లకు కాస్త ఊరట.. ఎందుకంటే గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ 25న 24 క్యారెట్ల తులం బంగారంపై రూ. 1000 తగ్గగా..ఇవాళ(26)న ఒక్కసారిగా రూ.1310 తగ్గింది. మరో వైపు  వెండి ధర కూడా నిన్నమొన్న లక్షకు పైగా ఉండగా.. ఏకంగా ఇవాళ( 26)కిలో వెండిపై ధర రూ. 2500 తగ్గి లక్షకు దిగువకు 98 వేలకు చేరింది.

 నవంబర్ 26 న  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒక్కసారిగా రూ.1310  తగ్గడంతో రూ. 77,240 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 తగ్గి రూ.70800కు చేరింది. 

ఇక ఢిల్లీలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1310  తగ్గడంతో  రూ.77,390 గా ఉంది.  ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1200 తగ్గి రూ. 70,950 గా ఉంది.

 విశాఖ, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,240  ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,800 గా ఉంది.