న్యూఢిల్లీ: బంగారం ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర ఢిల్లీలో రూ.1,100 పెరిగి రూ. 80,400 కి చేరుకుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత సీరియస్‌గా మారడంతో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది. 10 గ్రాముల గోల్డ్ గురువారం రూ.79,300 పలికింది.
సిల్వర్ రేటు శుక్రవారం కేజీకి రూ.300 పెరిగి రూ.93,300 కి చేరుకుంది. 99.5 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,100 పెరిగి రూ.80,000 ని టచ్ చేసింది. హైదరాబాద్‌లో 99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల గోల్డ్ ధర శుక్రవారం రూ.870 పెరిగి రూ.78,820కి చేరుకుంది. వెండి రేటు కేజీకి రూ.1,01,000 వద్ద ఫ్లాట్‌గా ఉంది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ గోల్డ్ కాంట్రాక్ట్ ధర రూ.906 పెరిగి రూ.77,599 వద్ద ట్రేడవుతోంది.