రూ.1,000 తగ్గిన గోల్డ్ రేటు

న్యూఢిల్లీ : గ్లోబల్‌‌ మార్కెట్లలో  బంగారానికి డిమాండ్ తగ్గడంతో 10 గ్రాముల  గోల్డ్ ధర సోమవారం  ఢిల్లీలో రూ.1,000 తగ్గి  రూ.79,400 కి దిగొచ్చింది. 99.9 శాతం ప్యూరిటీ గల గోల్డ్ రేటు శుక్రవారం  సెషన్‌‌లో  రూ.80,400 పలికింది. వెండి కేజీకి రూ.1,600 తగ్గి రూ.91,700 కి పడింది. 

హైదరాబాద్‌‌లో  99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల బంగారం రేటు సోమవారం రూ.1,000 తగ్గి రూ.78,550 కి దిగొచ్చింది. వెండి కేజికి రూ.5‌‌‌‌‌‌‌‌00 తగ్గి రూ.1,00,500 దగ్గర ఉంది. రష్యా–ఉక్రెయిన్‌‌ యుద్ధ ప్రభావం తగ్గుతుండడంతో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.