మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. నవంబర్ 18న  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 660 పెరగ్గా..నవంబర్ 19న  రూ.760 పెరిగి  రూ. 77 వేలు దాటింది. 

నవంబర్ 19న మంగళవారం హైదరాబాద్ లో  24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం  ధరపై   రూ. 760  పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ. 700 రూపాయలు పెరిగింది. 

హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,070  ఉండగా... 22 క్యారెట్ల బంగారం ధర 70,650 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77, 070  ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 650 గా ఉంది.  

అటు ఢిల్లీ, ముంబైలోనూ 24 క్యారెట్ల 10 గ్రాము బంగారం ధర రూ.77, 220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.70,800 గా ఉంది