వరుసగా నాలుగో రోజు.. రూ.1,400 పెరిగిన గోల్డ్ ధర

న్యూఢిల్లీ: గోల్డ్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,400 పెరిగి రూ.79,300 కి చేరుకుంది. జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరిగిందని ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం  రూ.77,900 పలికింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు.

కేజీకి రూ.93,000 దగ్గర ట్రేడవుతోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  10 గ్రాముల గోల్డ్ రేటు (99.9 శాతం ప్యూరిటీ) గురువారం రూ.330 పెరిగి రూ.77,950 కి చేరుకుంది. సిల్వర్ రేటు కేజీకి రూ.1,01,000 ఉంది.   ఎంసీఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్ ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.568 పెరిగి రూ.76,602 వద్ద ట్రేడవుతోంది.    రష్యా–ఉక్రెయిన్ మధ్య  యుద్ధం ముదరడంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోందని  ఎనలిస్టులు పేర్కొన్నారు.