Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు

 గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర శనివారం పెరిగింది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది..బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో టాప్ దేశాల్లో మన దేశం ఒకటి.. భారత్ లో బంగారానికి మంచి డిమాండ్ ఉంది..అందుకు గత మూడు నెలల్లో బంగారం ధరలు భారీగాపెరిగాయి.. 24 క్యారెట్ల 10 బంగారం (తులం ) ధర 80వేల మార్క్ ను దాటింది.. అయితే ఈ మూడు నెలల్లో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలో గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం ఒక్కసారిగా పెరిగింది. 

ALSO READ | Bihar Power Plant: థర్మల్ పవర్ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు

శనివారం ( డిసెంబర్ 21) 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం 71వేలకు చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే 600 రూపాయలు పెరిగింది.. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 77,450 కి చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ. 650 లు పెరిగింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.99వేలకు చేరింది. శుక్రవారం ధరతో పోలిస్తే..1000 రూపాయలు పెరిగింది.