హైదరాబాద్, వెలుగు: వంటనూనెల తయారీ సంస్థ గోల్డ్‌డ్రాప్ మరోసారి కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ (సీటీడీ) అవార్డును అందుకుంది. నాణ్యత, భద్రత పట్ల ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు గోల్డ్‌డ్రాప్‌కు ఈ అవార్డు వచ్చింది.
తాము ఈ అవార్డును గెలుచుకోవడం ఏడోసారని కంపెనీ తెలిపింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా ఈ అవార్డును అందుకున్నారు.