చెన్నూర్ పట్టణంలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న అమ్మవారిని భక్తులు సంప్రదాయంగా గంగా ఒడికి సాగనంపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా, చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. 

ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఉద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు.. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. కన్నును పండగగా సాగుతున్న శోభాయాత్ర వీక్షించడానికి పట్టణ వాసులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అర్జునగుట్ట వద్ద భక్తిశ్రద్ధలతో అమ్మవారి నిమజ్జనం చేశారు.