ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మండలం బాదనకుర్తిలోని గోదావరి వంతెనకు స్వర్గీయ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేశ్ పేరు పెట్టారు. గురువారం గ్రామ సమీపంలోని వంతెన వద్దకు ఆయా గ్రామాల ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరుకొని రాథోడ్ బ్రిడ్జిగా బోర్డు పెట్టారు. ఆయన మృతి పట్ల మౌనం పాటించారు. అనంతరం పలువులు మాట్లాడుతూ..
ఎమ్మెల్యేగా రాథోడ్ రమేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకొని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపేలా బ్రిడ్జి నిర్మించారని గుర్తు చేశారు. అందుకే బ్రిడ్జికి ఆయన పేరు పెట్టినట్లు చెప్పారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.