హైదరాబాద్లో జనవరి 3 నుంచి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు : తెలుగు ఎన్నారైల మొట్టమొదటి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025 జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్​లోని హైటెక్స్ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది.  అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్టా) దీనిని అమెరికాలోని తెలుగు ప్రజల కోసం నిర్వహిస్తోంది.  నార్త్ అమెరికా, యూరప్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆసియా వంటి పది దేశాల నుంచి వెయ్యి మంది భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలు కాన్ఫరెన్స్​లో​ పాల్గొంటారని బిజినెస్ ఫోరమ్ చైర్మన్​ రమేష్ తూము తెలిపారు. 

ఈ మూడు రోజుల కార్యక్రమం శుక్రవారం రాత్రి మొదలవుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య​అతిథిగా వస్తారు. 4 , 5 తేదీల్లో వ్యాపార సమావేశాలు ఉంటాయి. జనవరి 4 సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సుకు హాజరవుతారు. మరునాడు జరిగే ముగింపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారు. ఈ సందర్భంగా100 మంది ప్రముఖ స్పీకర్లు  ప్యానలిస్ట్‌‌‌‌‌‌‌‌లు 42 సెషన్లలో ప్రసంగిస్తారు.   

టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ,  మెడికల్ ఎడ్యుకేషన్, టూరిజం  హాస్పిటాలిటీ, హెల్త్, స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఆక్వా కల్చర్, అగ్రికల్చర్, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.