గీతకు సిద్ధంగా గిరిక తాటిచెట్లు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లిలో నాలుగేండ్ల కింద నాటిన 600 గిరిక తాటి చెట్లు పెరిగి కల్లు గీతకు సిద్ధమయ్యాయి. ఆ చెట్ల నుంచి కల్లు తీసేందుకు గీత కార్మికులు పనులు షురూ చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ ​పూర్తచందర్​రావు 2020లో గిరిక మొక్కలను ఏపీ నుంచి ప్రత్యేకంగా తెప్పించి బాదంపల్లిలోని గౌడ కులస్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

తెలంగాణలో అతి తక్కువగా ఉండే ఈ తాటిచెట్లకు రెండు పూటలా సుమారు 20 లీటర్ల వరకు కల్లు వస్తుందని గీత కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ చెట్లు ఎక్కడా లేవని, తమకు వాటిని అందించి ఉపాధి కల్పించిన పూర్ణచందర్ రావుకు గీత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.     - వెలుగు, జన్నారం