రేషన్ షాప్లో తుట్టెలు కట్టి.. పురుగులు పట్టి

కౌడిపల్లి మండలంలో 24  రేషన్​ షాప్​లు ఉండగా కొన్ని షాప్​లకు సరఫరా అయిన బియ్యం రాళ్లు, దుమ్ము ఉండడంతోపాటు ముక్కిపోయి, తుట్టెలు కట్టి, పురుగులు పట్టి ఉన్నాయి. బాగాలేని ఆ బియ్యాన్ని ఎలా తినాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.  కోళ్లు, కుక్కలు తినని ఇలాంటి బియ్యాన్ని మనుషులు ఎవరైనా తింటారా అని మహిళలు మండిపడుతున్నారు.  కౌడిపల్లి, బుజిరంపేట, రాజిపేట్, తునికి, దేవులపల్లి, కుకుట్లపల్లి

సదాశివ పల్లి, ధర్మసాగర్,తిమ్మాపూర్, వెంకటాపూర్ (ఆర్) రేషన్ షాప్ లకు ఇలాంటి బియ్యం వచ్చాయి.  అసలే  వర్షాకాలంలో లేనిపోని రోగాలు వస్తున్నాయని, ఇప్పుడు ఇలాంటి బియ్యం తింటే రోగాల పాలు కాక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాగా లేని బియ్యాన్ని రిటన్​చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు.- కౌడిపల్లి, వెలుగు