ఇంట్లో లింగ నిర్ధారణ టెస్ట్ ‌‌‌‌‌‌‌‌లు.. ఐదుగురు అరెస్ట్ 

 కామారెడ్డి, వెలుగు: ఇంట్లో స్కానింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకుని లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ఆర్ఎంపీతో పాటు మరో నలుగురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సింధూశర్మ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ ‌‌‌‌‌‌‌‌ స్థానికంగా సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్ ‌‌‌‌‌‌‌‌తో పాటు, కామారెడ్డిలోని కౌసల్య హాస్పిటల్ ‌‌‌‌‌‌‌‌ స్కానింగ్​సెంటర్లలో పని చేశాడు.

2021లో కౌసల్య హాస్పిటల్ ‌‌‌‌‌‌‌‌ను వైద్యశాఖ ఆఫీసర్లు సీజ్​చేశారు. దీంతో రవీందర్ ఈజీగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఇంటర్నెట్ ‌‌‌‌‌‌‌‌లో అల్ర్టా సౌండ్ ‌‌‌‌‌‌‌‌ స్కానింగ్ ‌‌‌‌‌‌‌‌ మెషీన్ ‌‌‌‌‌‌‌‌ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తుల వద్ద స్కానింగ్ మెషీన్ ‌‌‌‌‌‌‌‌ కొన్నాడు. దానిని ఇంట్లోనే ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ టెస్ట్ ‌‌‌‌‌‌‌‌లు చేయడం ప్రారంభించాడు. పోలీసులకు సమాచారం అందడంతో  సీసీఎస్, రాజంపేట పోలీసులు గురువారం రవీందర్ ‌‌‌‌‌‌‌‌ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో సిద్దిపేట జిల్లా వర్గల్ ‌‌‌‌‌‌‌‌ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగ నిర్ధారణ టెస్ట్ ‌‌‌‌‌‌‌‌లు చేస్తూ రవీందర్ ‌‌‌‌‌‌‌‌ రెడ్ ‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్ ‌‌‌‌‌‌‌‌గా పట్టుబడ్డాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

స్కానింగ్ మెషీన్ అమ్మిన విజయవాడకు చెందిన పొటాల శాంసన్, చింతలపూల దుర్గ ప్రసాద్ ‌‌‌‌‌‌‌‌ను, టెస్ట్ ‌‌‌‌‌‌‌‌ల కోసం పేషెంట్లను పంపుతున్న కామారెడ్డి జిల్లా గిద్దకు చెందిన ఆర్ఎంపీ బోయిని యాదగిరి, గొట్టిముక్కులకు చెందిన ఆర్ఎంపీ బక్కి ప్రవీణ్ ‌‌‌‌‌‌‌‌కుమార్ ‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం అరెస్ట్ ‌‌‌‌‌‌‌‌ చేశారు. నిందితుడు రవీందర్ ‌‌‌‌‌‌‌‌కు సహరిస్తున్న మరికొందరిని త్వరలోనే పట్టుకుంటామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ సింధూ శర్మ వివరించారు.

కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్​ఇన్ ‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ శ్రీనివాస్, బిక్కనూరు సీఐ సంపత్ ‌‌‌‌‌‌‌‌కుమార్ ‌‌‌‌‌‌‌‌, రాజంపేట ఎస్సై పుష్పరాజ్, సీసీఎస్​ఎస్సై ఉస్మాన్, ఏఎస్సై రాజేశ్వర్ ‌‌‌‌‌‌‌‌ని అభినందించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ టెస్ట్ ‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నట్లు తేలితే డయల్100గానీ, పోలీస్ ‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ ‌‌‌‌‌‌‌‌ రూం నంబర్ ‌‌‌‌‌‌‌‌ 87126 86133కి గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.