నారాయణ్ ఖేడ్ నుంచి కర్నాటక తరలిస్తున్న గంజాయి పట్టివేత

నారాయణ్ ఖేడ్,వెలుగు: ఖేడ్ నుంచి కర్నాటక తరలిస్తున్న గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ వెంకటరెడ్డి కథనం ప్రకారం.. ఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని ధన్వార్ చౌరస్తా వద్ద ఎక్సెల్ వాహనంపై ఐదున్నర కిలోల ఎండు గంజాయిని ఎస్ఐ అంబ్రా నాయక్ పట్టుకున్నట్టు తెలిపారు. రేగోడు మండలం దోసపల్లికి చెందిన యేసయ్య, వట్టిపల్లి మండలం పాలడుగు చెందిన విట్టల్ ఇద్దరూ కలిసి ఎక్సెల్ వాహనంపై ఐదున్నర కిలోల ఎండు గంజాయిని కర్నాటకలోని బీదర్ కు విక్రయించేందుకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి గంజాయిని, ఎక్స్ఎల్ వాహనాన్ని పీఎస్​తరలించినట్లు తెలిపారు.