లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో గణేశ్ లడ్డూ వేలం పాటలో రికార్డు ధర పలికింది. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం హోరాహోరీగా సాగింది. చివరకు పట్టణానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి నరేందుల చంద్రశేఖర్ రూ.70 వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. పట్టణంలో ఇప్పటివరకు జరిగిన లడ్డూ వేలంపాటలో ఇదే అత్యధికం. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
రూ.45 వేలు పలికిన రిమ్స్మహాగణపతి లడ్డూ
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్పట్టణంలోని రిమ్స్మహాగణపతి ఆలయంలో సోమవారం నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రూ.45,500 పలికింది. పట్టణానికి చెందిన దశరథ్పటేల్కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా దశరథ్ పటేల్‌కు ఆలయ కమిటీ సభ్యులు మహాగణపతి ఆలయ జ్ఙాపికను అందజేశారు.